Breaking News

అత్త చేతుల మీదుగా.. అల్లుడి హత్య

Published on Tue, 03/25/2025 - 07:31

దొడ్డబళ్లాపురం: ఓ యువతిని మోహించి పెళ్లాడాడు, కానీ అక్కడితో తన బతుకు అంతమవుతుందని ఊహించలేకపోయాడు. హెసరఘట్ట వద్ద బీజీఎస్‌ లేఔట్‌లో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లోకనాథ్‌ సింగ్‌ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

డిసెంబరులో వివాహం...
పోలీసుల కథనం మేరకు... మాగడి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలక్రిష్ణకు సన్నిహితునిగా లోకనాథ్‌ సింగ్‌కు పేరుంది. 22న రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. లోకనాథ్‌ భార్య తల్లి (అత్త) స్వయంగా అల్లున్ని హత్య చేయించిందని తెలిసింది. గత డిసెంబర్‌లో లోకనాథ్‌ ఒక యువతిని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇష్టం లేకపోయినా, ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. కానీ అల్లునిపై పగ పెంచుకున్నారు. అనుకున్న ప్రకారం శనివారం బీజీఎస్‌ లేఔట్‌కు లోకనాథ్‌తో పాటు భార్య, అత్త వచ్చారు. 

కొత్తగా నిర్మిస్తున్న కట్టడంలో భార్యతో కలిసి లోకనాథ్‌ మద్యం తాగాడు. లోకనాథ్‌తో వచ్చిన గన్‌మ్యాన్‌ను అత్త ఏదో సాకుతో పంపించేసింది. లోకనాథ్‌కు భోజనంలో మత్తు మందిచ్చింది. అతి తినగానే మద్యం, మత్తు ప్రభావం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు. అత్త పదునైన కత్తితో అల్లున్ని గొంతుకోసి ప్రాణాలు తీసింది. తరువాత తల్లీ కూతురు ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయారు. ఎవరో స్నేహితులు హత్య చేసినట్టు నాటకం ఆడారు. పోలీసులు తల్లి, కుమార్తెను అరెస్టు చేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)