Breaking News

నేటి నుంచి పార్లమెంట్‌

Published on Mon, 06/24/2024 - 05:01

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం, మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి వారితో మెహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు.

 ఆంగ్ల వర్ణక్రమంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.   
స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లా!  
ప్రొటెం స్పీకర్‌ ప్యానెల్‌లో ఉండడానికి విపక్ష నేతలు విముఖత చూపడంతో స్పీకర్‌ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి స్పీకర్‌ పదవిని ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాలకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకత్వం స్పీకర్‌ పదవిని ఇతరులకు ఇచ్చే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పీకర్‌ పదవిని మహిళలకు కేటాయించే పక్షంలో గుజరాత్‌కు చెందిన పూనంబెన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. గత లోక్‌సభను తనదైన రీతిలో ముందుకు నడిపించిన ఓం బిర్లా పేరు కూడా తెరపైకి వచి్చంది. గత లోక్‌సభలో విపక్ష సభ్యులు తక్కువైనప్పటికీ వారు వినిపించిన ప్రభుత్వ వ్యతిరేక గళం అధికార పక్షంపై ప్రభావం చూపకుండా సభను నడిపించడంలో ఓం బిర్లా చాతుర్యం చూపించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)