Breaking News

రాహుల్‌ ‘యువ న్యాయ్‌’

Published on Fri, 03/08/2024 - 06:11

జైపూర్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పలు నూతన హామీలను ప్రకటించారు. గురువారం భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర మధ్యప్రదేశ్‌లో పూర్తిచేసుకుని రాజస్థాన్‌లో అడుగుపెట్టిన సందర్భంగా బాంసవాడా పట్టణంలో ఏర్పాటుచేసిన సభలో రాహుల్‌ హామీల జల్లు కురిపించారు. ‘‘మేం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను మొట్టమొదట భర్తీచేస్తాం.

డిగ్రీ, డిప్లొమా చేసి ఖాళీగా ఉన్న పాతికేళ్లలోపు యువతకు అప్రెంటిస్‌షిప్‌ కింద శిక్షణ ఇప్పించి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. అప్రెంటిస్‌ కాలంలో వారికి సంవత్సరానికి రూ.1 లక్ష  స్టైపండ్‌ అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షా పేపర్ల లీకేజీ ఉదంతాలు పునరావృతంకాకుండా కఠిన చట్టం తీసుకొస్తాం. తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాం. యువత ఏర్పాటుచేసే అంకుర సంస్థల తోడ్పాటు కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తాం’’ అని రాహుల్‌ అన్నారు.

యువతకు ఇచ్చిన ఈ ఐదు హామీలకు రాహుల్‌ ‘యువ న్యాయ్‌’గా అభివరి్ణంచారు. ‘‘ డ్రైవర్, గార్డ్, డెలివరీ బాయ్‌ ఉద్యోగాలు చేసే గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కలి్పస్తూ రాజస్థాన్‌లో ఇప్పటికే చట్టం తెచ్చారు. ఇదే తరహా చట్టాన్ని దేశమంతటా అమలుచేస్తాం. ఔట్‌సోర్సింగ్‌ విధానానికి స్వస్తిపలికి ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష విధానంలో ప్రమాణాలను పటిష్టంచేస్తాం.

లీకేజీలకు తావులేకుండా కఠిన చట్టం తెస్తాం’ అని అన్నారు. ‘‘ ఢిల్లీ చలో ఉద్యమబాటలో పయనిస్తున్న రైతాంగానికి మేలు చేకూర్చేలా పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. కులగణన చేపడతాం’’ అని రాహుల్‌ అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల నుంచి న్యాయం కోరడం కూడా నేరమేనని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో మహిళల రేప్, ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ విమర్శించారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి