Breaking News

Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు

Published on Tue, 04/09/2024 - 06:14

న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు రెండు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటల్లాంటి మారుమూల ప్రాంతాల్లో 118 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్‌ చౌదరి చెప్పారు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్‌ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు సిబ్బందితోపాటు సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపుతామన్నారు. నుగ్డి గ్రామంలోని మిడిల్‌ స్కూల్, బొరెరో గ్రామంలోని మధ్య విద్యాలయలో మొదటిసారిగా పోలింగ్‌ బూత్‌లను నెలకొల్పామన్నారు.

కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఏ ప్రాంతాన్నీ వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్‌ అనకొండ’ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్‌ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాయని పేర్కొన్నారు. 121 పోలింగ్‌ బృందాలను రైళ్ల ద్వారా పంపించామన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కలి్పంచినట్లు చెప్పారు. ఎస్టీ్ట రిజర్వుడు స్థానమైన సింగ్‌భూమ్‌లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య, సిట్టింగ్‌ ఎంపీ గీతా కోడా రంగంలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యరి్థని ప్రకటించాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)