Breaking News

Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్‌ సానుభూతిపరులు

Published on Thu, 05/23/2024 - 05:31

బస్తీ/శ్రావస్తి: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్‌ సానుభూతిపరులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ఆ రెండు పార్టీలు మన దేశాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ కలిసి ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజుల ఫ్లాప్‌ సినిమా రీరిలీజ్‌ అవుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ, శ్రావస్తిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఉగ్రవాదంతో మనల్ని భయపెట్టాలని చూసిన పాకిస్తాన్‌ ఇప్పుడు తిండి లేక అల్లాడుతోందని చెప్పారు. పాకిస్తాన్‌ పని అయిపోయిందని తేల్చిచెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్‌ సానుభూతిపరులైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మనల్ని బెదిరించడంలో బిజీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌ వద్ద అణుబాంబులు ఉంటే, ఇండియాలో 56 అంగుళాల ఛాతీ ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలను చూసి బెదిరిపోవడానికి ఇక్కడున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని, బలమైన మోదీ ప్రభుత్వమని స్పష్టంచేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)