Breaking News

చెన్నై జూలో సింహం మిస్సింగ్‌ కలకలం!

Published on Mon, 10/06/2025 - 12:36

చెన్నై వాండలూర్ జూలో ఓ సింహం కనిపించకుండా పోవడంతో అధికారులు హడలిపోయారు. రాత్రికి రాత్రే దాని ఆచూకీ కనిపెట్టేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరాఖరికి దాని ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్‌ 3వ తేదీన జరిగిన ఈ ఘటన.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్.. దక్షిణ భారత దేశంలో ఉన్న అతిపెద్ద జూ పార్కుల్లో ఒకటి. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆ జూలో హైడ్రామా నడిచింది. ఎప్పటిలాగే సింహాలన్నీ సాయంత్రం కాగానే ఎన్‌క్లోజర్‌లోకి చేరుకోగా.. శేర్యార్‌ అనే సింహం మాత్రం తిరిగి రాలేదు(Lion Missing Zoo). దీంతో సిబ్బంది కంగారపడిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.

అంతా కలిసి ఐదు బృందాలుగా విడిపోయి సింహం కోసం జూ అంతా గాలించారు. రాత్రి పూట పని చేయగలిగే థర్మల్‌ డ్రోన్ల, ట్రాప్‌ కెమెరాల సహకారం తీసుకున్నారు. అయితే కొన్నిగంటల తర్వాత అది సఫారీలో ఓ చోట ప్రశాంతంగా కూర్చు ఉండిపోవడం గమనించారు. బౌండరీ వాల్, చెయిన్-లింక్ మెష్ ఫెన్సింగ్ ఉన్న సఫారీని నుంచి అది తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఐదేళ్ల వయసున్న శేర్యార్‌ను 2023లో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్‌(Bannerghatta national park) పార్క్ నుంచి తీసుకొచ్చారు. లయన్‌ సఫారీ అలవాటు చేయడానికి మిగతా వాటితో పాటే దానిని రెగ్యులర్‌గా బయటకు వదులుతున్నారట. అయితే ఈ వయసులో సింహాలకు ఇలాంట ప్రవర్తన సహజమేనని అధికారులు తెలిపారు. ఈ లయన్‌ మిస్సింగ్‌ ఘటనతోనే.. అక్టోబర్ 5న జరగాల్సిన వైల్డ్ ట్రెయిల్ రన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘శబరిమలై’ వివాదం

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)