Breaking News

‘పోటీ చేస్తాను.. పోటీ చేస్తూనే ఉంటాను’

Published on Wed, 05/01/2024 - 13:28

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఒక అభ్యర్థి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల్లో గెలవాలని కాకుండా, తన అభిరుచిని నెరవేర్చుకునేందుకే ఇలా అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వస్తున్నారు. 

అతనే వారిస్‌ హసన్ లాహిరి. రాష్ట్రీయ నారాయణ్ వికాస్‌వాది పార్టీ అభ్యర్థి. ఆయన యూపీలోని అమేథీ జిల్లాలోని గౌరీగంజ్‌కు చెందిన వ్యక్తి. హసన్‌ లాహిరి గతంలో అంటే 2004, 2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే ప్రస్తుత 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అమేథీ నుంచి పోటీకి దిగారు.  అలాగే 2007, 2012, 2017, 2022లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. వారిస్ హసన్ లాహిరి 10వ తరగతి వరకు చదువుకున్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మా మాతృభూమి గౌరీగంజ్ అని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బడా నేతలు సైతం పోటీ పడుతుంటారని తెలిపారు. తనకు ఎవరూ వ్యతిరేకం కాదని, ప్రజల గొంతు వినిపించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా నిరంతరం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని లాహిరి తెలిపారు. నిరంతరం ప్రజల గౌరవాన్ని కాపాడుతూనే ఉంటానని, విజయం సాధించే వరకూ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)