రాహుల్, పప్పూయాదవ్‌లపై సాధువుల ఫిర్యాదు

Published on Sat, 08/01/2026 - 17:26

లక్నో: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎంపీ పప్పూయాదవ్‌పై హిందూ సన్యాసులు, లాయర్లు ఫిర్యాదు చేశారు.అయోధ్య రామమందిర హుండీ చోరీ పేరుతో పార్లమెంట్‌ ఎదుట వీరు నాటకం వేశారన్నారు. ఆ నాటకం హిందూ ధర్మాన్ని సన్యాసులను అవమానించే విధంగా ఉందని వారణాసిలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలలో ఫిర్యాదు చేశారు.

హిందూ సాధువు బాలక్‌దాస్ దేవచార్య మాట్లాడుతూ "పార్లమెంటు బయట పప్పు యాదవ్ చేసిన చర్య ద్వారా, ఆయన కాషాయ వస్త్రాలను, సాధు సమాజాన్ని, శ్రీరాముడినీ అవమానించారు. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతిపక్ష నాయకులందరిపై ఫిర్యాదు దాఖలు చేశాం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం," అని అన్నారు.

అదే న్యాయవాది వినీత్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం సనాతన ధర్మాన్ని అవమానిస్తోందన్నారు "నిన్న పార్లమెంటులో సనాతన ధర్మాన్ని అవమానించారని మేము భావిస్తున్న దానిపై ఫిర్యాదు చేశాము. పప్పు యాదవ్, రాహుల్ గాంధీలపై కేసు నమోదు చేయాలని కోరాము. మేము కేవలం వినతిపత్రం కాకుండా, కంటోన్మెంట్ పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించాము." అని తెలిపారు.

ఫిర్యాదు ఎందుకు 
కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  నిన్న (శుక్రవారం) కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఆ పార్టీ ఎంపీ పప్పూయాదవ్‌ కాషాయ వస్త్రాలు ధరించారు. పూజారి వేషంలో విరాళాల పెట్టె పట్టుకొని ముఖద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.ఆ సమయంలో అక్కడి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరుస్తూ హుండీలో కానుకలు వేశారు.  ఈ సందర్బంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ పప్పూయాదవ్‌కు నమస్కారం పెట్టి హుండీలో కానుకలు వేశారు. కాగా దీనిపై ఇప్పుడు ఫిర్యాదు చేశారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)