Breaking News

అమెరికాలో అన్మోల్‌ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించే ప్రయత్నాలు‌

Published on Sat, 11/02/2024 - 11:48

ముంబై: లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు.‌‌ దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. 

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్‌కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్‌ బిష్ణోయ్‌ టచ్‌లో ఉండటం గమనార్హం. అన్మోల్‌ బిష్ణోయ్‌ సోదరుడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.

అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డ్
అన్మోల్ బిష్ణోయ్‌ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్‌లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు