Breaking News

కలిసి జీవిస్తే సరిపోతుందా?.. విడాకులెలా కోరతారు?

Published on Tue, 06/13/2023 - 16:12

మన దేశ చట్టాల్లో భూతద్దం పెట్టి చూసిన దొరకని ‘సహజీవనం’ అనే బంధం గురించి ఆసక్తికరమైన తీర్పు ఒకటి వెలువడింది. సహజీవనంలో ఉన్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే చట్టం ప్రకారం అది పెళ్లి కానప్పుడు.. విడాకుల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ఓ జంటను ప్రశ్నించింది కేరళ హైకోర్టు.

ఏ చట్టంలోనూ కలిసి ఉంటే పెళ్లి అని లేదు. ఇద్దరి మనసులు కలిసాయని సహజీవనం చేసేవాళ్లకు విడాకులు అడిగే హక్కే లేదు. కేవలం పర్సనల్‌, సెక్యులర్‌ చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించినా.. అది వివాహం కిందకు రాదని, విడాకులకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది బెంచ్‌. చట్టం ప్రకారం ఒక్కటైన జంటలకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు మన చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా పిటిషనర్లకు కోర్టు గుర్తుచేసింది. 

2006 నుంచి వేర్వేరు మతాలకు చెందిన  ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. పైగా తమ బంధానికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. ఓ బిడ్డనూ కన్నారు. ఈ క్రమంలో మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్ట ప్రకారం వివాహం కానప్పుడు విడాకులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. 

దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. చట్టం ప్రకారం సహజీవనానికి గుర్తింపు లేదు. కలిసి ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు విడిపోవడానికి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇది వీలుకాని విషయం. చట్టంలోనూ అందుకు వెసులుబాటు లేదు అని జస్టిస్‌ ముహమ్మద్‌ ముస్తాఖ్‌, జస్టిస్‌ సోఫీ థామస్‌ నేతృత్వంలోని బెంచ్‌ తీర్పు ఇచ్చింది.

ఇక ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ద్వారా గుర్తించబడిన వివాహాలకు సంబంధించిన దావాలను మాత్రమే స్వీకరించే పరిధి ఫ్యామిలీ కోర్టులకు ఉందని, పై పిటిషన్‌ను విచారణకు తీసుకుని కొట్టేసే బదులు.. పిటిషన్‌ నిర్వహణ సాధ్యం కాదని ముందుగానే పిటిషన్‌ను తిరస్కరించి ఉండాల్సిందని, తద్వారా కోర్టు సమయం వృథా కాకుండా ఉండేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

ఇది రూ.10 మర్డర్‌ కేసు.. చదివేయండి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)