హీరోయిన్‌ దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్‌

Published on Wed, 09/17/2025 - 21:33

సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశాపఠానీ ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

సెప్టెంబర్‌ 12న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీ నగర సివిల్‌ లైన్స్‌ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారు జామున సరిగ్గా 3.45 నిమిషాలకు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్‌లు ఈ కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు.

ఆ మరుసటి రోజే ఘాజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి తుపాకీ,బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అమితాబ్ యష్ తెలిపారు.
 
ఇటీవల,దిశా పటానీ సోదరి,మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)