Breaking News

జమ్ము కశ్మీర్‌ ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రరిస్ట్‌ హస్తం!

Published on Sun, 07/07/2024 - 12:27

శ్రీనగర్‌:  జమ్ము కశ్మీర్‌లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న  ఉగ్రదాడుల వెనక లష్కర్‌-ఇ-తోయిబా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉ‍న్నట్లు నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఎజేన్సీ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. పాకిస్తాన్‌లోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందిన సాజిద్‌.. లష్కర్‌-ఇ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది. అతని తలపై రు. 10 లక్షల రివార్డు ఉ‍న్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.

సైఫుల్లా సాజిద్ జట్  పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌లో బేస్‌ క్యాంపు కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన భార్య తనతోపాటు ఉంటోంది. సాజిద్‌  గతంలో పాక్‌ ఆక్రమిత  కశ్మీర్‌లో సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. అనంతరం అతను లష్కరే తొయిబాలో చేరి.. ప్రస్తుతం ఉగ్రవాదుల నియామకాలను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా భారత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదలుకు సాయం చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.

లష్కరే తొయిబాలో సాజిద్‌ ఆపరేషనల్ కమాండర్‌. దీంతో ఉగ్రవాదులు నిధులు సమకూర్చుతాడు. సాజిత్‌ ఎన్‌ఐఏ జాబితాలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది.  సాజిత్‌కు ఖాసిమ్అనే వ్యక్తి సాయం చేస్తున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఖాసిమ్‌ కోసం వెతుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కశ్మీర్‌ వ్యాలీలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక సాజిద్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 

గత నెలలో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతిచెందాడు.  గడిచిన రెండు రోజుల్లో  కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)