రూ. 150 కోట్ల ఆస్తి, తండ్రిని కాల్చి చంపిన పెద్ద కొడుకు

Published on Thu, 07/16/2026 - 14:38

ఆస్తి వివాదం ఒక తండ్రి ప్రాణాలు తీసింది. 32 ఏళ్ల కొడుకు తన తండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపేశాడు.  రూ. 150 కోట్ల ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన వివాదం ఈ విషాదానికి దారి తీసింది. ఘాజియాబాద్‌లోని మోదీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి   జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

మృతుడిని మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుదానా గ్రామానికి చెందిన 52 ఏళ్ల హరిఓం చౌదరిగా గుర్తించారు. ఆయన ఆ ప్రాంతంలోనే అత్యంత సంపన్న రైతులలో ఒకరు.హరిఓం చౌదరికి మోదీనగర్‌లో 75 బిగాల భూమితో పాటు ఢిల్లీ-మీరట్ రోడ్డులో ఒక మార్కెట్ కూడా ఉంది.  అలా ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ. 150 కోట్లు ఉంటుందని అంచనా.

గొడవకు కారణం
హరిఓం చౌదరి తన పెద్ద కుమారుడైన నిఖిల్‌కు ఇప్పటికే మార్కెట్‌లోని కొన్ని షాపులను, 25 బిగాల భూమిని ఇచ్చారు. అయితే, మిగిలిన భూమిని కూడా తన పేరు మీద రాయాలని నిఖిల్ గొడవ పడేవాడు. నిఖిల్‌కు మద్యపాన వ్యసనం ఉండటంతో, ఆస్తి ఇస్తే తాగుడుకు, జల్సాలకు తగలేస్తాడని తండ్రి నిరాకరించాడు. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య  తరచూ వాగ్వాదం నడుస్తూ ఉండేది.  ఈ   క్రమంలో బుధవారం రాత్రి హరిఓం చౌదరి తన భార్య అనిత, చిన్న కుమారుడు నీషుతో కలిసి భోజనాలుముగించాక, పెద్ద కుమారుడు నిఖిల్ మద్యం మత్తులో ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తాగి వచ్చినందుకు తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన నిఖిల్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసి తండ్రిపై కాల్పులు జరిపాడు. మొదట ఒక బుల్లెట్ హరిఓం ముఖానికి తగలడంతో ఆయన కింద పడిపోయారు. ఆ తర్వాత నిందితుడు ఆయన ముఖం, ఛాతి, పొత్తికడుపు భాగాలపై మరికొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు.  అనంతరం ఆయుధంతో సహా ఘటనా స్థలం నుండి పరారయ్యాడు.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

గతంలోనూ ఇలా
పోలీసుల ప్రాథమిక విచారణలో నిఖిల్‌కు తాగుడు విషయంలో తరచూ తల్లిదండ్రులతో గొడవలు జరిగేవి. అంతేకాకుండా, 2018లో కూడా ఒక గొడవ సందర్భంగా నిఖిల్ తన తమ్ముడు నీషుపై కాల్పులు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఆ పాత కేసును కూడా రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అతనిని అరెస్టు చేయడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్‌ భావోద్వేగ సందేశం
ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్‌, మరో ఇద్దరు భారతీయ నిపుణులు

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)