Breaking News

కామెడీ షోలో లేడీ డాక్టర్‌ వల్గర్‌ కామెంట్లు

Published on Thu, 06/11/2026 - 13:56

కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సీజల్ పవార్ అనే డాక్టర్, శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్‌ పార్ట్‌ల గురించి తాను, తన తోటి మహిళా డాక్టర్లు జోకులు వేసుకుంటామంటూ ఆమె మాట్లాడారు. ఆ సమయంలో ప్రణీత్‌ సహా అంతా సరదాగా నవ్వులు చిందించారు. అయితే ఆమె అనుచితంగా మాట్లాడారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో వైద్య వర్గాలు, విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. వైద్య విద్యలో కాడేవర్ స్టడీ అనేది ఒక గౌరవప్రదమైన శాస్త్రీయ ప్రక్రియ అని, దానిపై జోకులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై నైతిక బాధ్యత, మాటల పరిమితులు, పబ్లిక్ ఫిగర్ల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై ఎంత స్థాయిలో చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో లేవనెత్తబడింది.

వివాదం పెరుగుతుండటంతో సీజల్ పవార్ తన వ్యాఖ్యలపై ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఇక ఈ షోలో పాల్గొన్న కామెడియన్ ప్రణీత్ మోర్ కూడా విమర్శల మధ్య సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)