Breaking News

‘కుంబ్‌’ వ్యర్థమా?.. మరి హాలోవిన్‌?’

Published on Sun, 11/02/2025 - 10:05

న్యూ ఢిల్లీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీరుపై బీజేపీ మండిపడింది. ఇటీవల లాలూ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలోవీన్ (Halloween) పండుగను జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన మహా కుంభ్ మేళాను నాడు అర్థరహితం అని అభివర్ణించిన లాలూ యాదవ్, ఇప్పుడు ఒక పాశ్చాత్య పండుగను ఆనందంగా జరుపుకోవడం ఏమిటని బీజేపీ నిలదీసింది.

లాలూ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ మహిళా నేత రోహిణి ఆచార్య యాదవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో హాలోవీన్ వేడుకల వీడియోలను పంచుకున్నారు. ‘అందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్  చేశారు. ఆ వీడియోలలో లాలూ యాదవ్ తన మనవరాళ్లకు ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్‌ అయిన దరిమిలా.. లాలూ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, బీజేపీ కిసాన్ మోర్చా (బీజేపీకేఎం) ఘాటుగా స్పందించింది. ‘బీహార్ ప్రజలారా.. మర్చిపోవద్దు. నమ్మకం, ఆధ్యాత్మికతను వ్యర్థం అన్న లాలూ యాదవ్‌ ఇప్పుడు ఆంగ్లేయుల పండుగ హాలోవీన్ జరుపుకుంటున్నారు. నమ్మకంపై దాడి చేసే వారికి బీహార్ ప్రజలు ఓటు వేయరు’ అని ‘ఎక్స్‌’లో పేర్కొంది.
 

ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ‘కుంభ్‌కు అర్థం లేదు... అది అర్థరహితం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఉన్నాయని  బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ శర్మ అప్పట్లో విమర్శించారు.

ఇది కూడా చదవండి: london: రైలులో కత్తిపోట్లు.. 9 మంది పరిస్థితి విషమం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)