Breaking News

Kerala: భార్యను హతమార్చి.. ఫేస్‌బుక్ లైవ్‌లో..

Published on Mon, 09/22/2025 - 15:29

కొల్లం: కేరళలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్తే హత్య చేసి, అనంతరం ఫేస్‌బుక్ లైవ్‌లో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన  పునలూర్ సమీపంలోని కూతనాడిలో  చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలిని కొల్లం నివాసి షాలినిగా గుర్తించారు.

భార్య షాలినిని హత్యచేసిన అనంతరం భర్త ఐజాక్‌ పునలూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం షాలిని, ఐజాక్‌ దంపతుల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలున్నాయి. సోమవారం షాలిని స్నానం చేసేందుకు వెళుతున్నప్పుడు ఐజాక్‌ ఆమెపై కత్తితో దాడి చేసి, ఆమె మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు ఐజాక్ ఫేస్‌బుక్‌ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించాడు. షాలినిపై అపనమ్మకం ఏర్పడిందని ఆరోపించాడు.

తరువాత ఐజాక్‌ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు  తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే నిందితుని ఇంటికి చేరుకుని, షాలిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. షాలిని, ఐజాక్‌ల 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుని, దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని, మృతురాలు, నిందితుని మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)