Breaking News

బలవంతంగా దహనం చేశారు

Published on Fri, 09/06/2024 - 06:27

కోల్‌కతా: కూతురు మృతదేహాన్ని భద్రపరచాలని భావించినప్పటికీ పోలీసుల బలవంతంకారణంగానే దహనం చేయాల్సి వచి్చందని కోల్‌కతాలో హత్యకు గురైన జూనియర్‌ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌జీ కర్‌ వైద్యకళాశాల బయట ఆందోళన చేస్తున్న వైద్యులకు బుధవారం బాధిత వైద్యురాలి తల్లిదండ్రులు, బంధువులు మద్దతు తెలిపారు. ‘న్యాయం జరిగేదాకా నిద్రించేది లేదు’’అని బాధితురాలి తల్లి అన్నారు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడారు. 

డబ్బులు ఇవ్వజూపారు 
కుమార్తె మృతదేహం తమ ముందు ఉండగానే నార్త్‌ డెప్యూటీ కమిషనర్‌ తమకు డబ్బు ఆఫర్‌ చేశారన్నారు. ‘‘మేము మృతదేహాన్ని భద్రపరచాలని అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్లి చూడగా బయట 300 మంది పోలీసులు నిల్చుని ఉన్నారు. ఆమెను దహనం చేయాల్సిందేనని మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడిచేశారు. దహన సంస్కారాలకు హడావుడి చేసి, దహనసంస్కారాల ఖర్చు కూడా మా వద్ద ఎవరూ వసూలుచేయలేదు. కనీసం దహనసంస్కారాలకు కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవని నా కూతురికికూడా తెలుసనుకుంటా. అందుకే ఇలా వెళ్లిపోయింది’’అని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘కొందరు పోలీసు అధికారులు ఖాళీ కాగితంపై సంతకాన్ని పెట్టాలని నన్ను బలవంతపెట్టారు. 

కోపంతో నేను ఆ పేపర్‌ను చింపేసి విసిరేశా. అసలు మృతదేహాన్ని పరీక్షించకముందే నా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు ఎందుకు చెప్పారు?. మా అమ్మాయి ముఖం చూసేందుకు మూడున్నర గంటలు వేచి చూడాల్సి వచి్చంది. చూడనివ్వాలని తల్లి కాళ్ల మీద పడినా ఎవరూ పట్టించుకోలేదు. పోస్ట్‌మార్టమ్‌ ఎందుకంత ఆలస్యం చేశారు? పోలీసులు అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారు? తాలా పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి 7 గంటలకే ఫిర్యాదుచేస్తే 11.45 గంటల దాకా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు?’అని తండ్రి ప్రశ్నించారు. 

అన్నీ అనుమానాలే..  
తల్లిదండ్రులు ఆస్పత్రి వచి్చన 10 నిమిషాలకే వారిని ఘటనాస్థలికి తీసుకెళ్లామని సుప్రీంకోర్టుకు సమరి్పంచిన అఫిడవిట్‌లో కోల్‌కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే మూడు గంటలకుపైగా వేచి చూశామని, తమ కుమార్తెను కడసారి చూసేందుకు అనుమతించాలని పోలీసులను వేడుకున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేశారని, అయినా ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం తెల్సిందే.  

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)