Breaking News

కోల్‌కతా డాక్టర్‌ ఉదంతం: ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

Published on Mon, 10/07/2024 - 15:12

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వేస్టిగేషన్‌ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.

ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్‌లో తెలిపింది.

జూనియర్‌ డాక్టర్‌ ఆగస్టు 9న ఆర్జీకర్‌ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్‌ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్‌ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర​్‌ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.

చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)