Breaking News

కోల్‌కతా డాక్టర్‌ కేసు: నిందితులకు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌

Published on Sat, 08/24/2024 - 13:56

కోల్‌కతా: కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మురం చేస్తోంది. తాజాగా ఆదివారం ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌, ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్‌ సందీష్‌ హోష్‌, మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ టెస్ట్‌లు నిర్వహించటం కోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (SEPSLA) ప్రత్యేక బృందం కోల్‌కతా చేరుకున్నట్లు తెలిపారు. పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు కొనసాగుతున్నాయని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇక.. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు జైలులోనే పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహిస్తామని, మిగతావారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్‌లు కొనసాగుతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్టియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు, ఒక హౌస్ సర్జన్, ఇంటర్న్‌షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు. వీరందరూ కలిసి బాధిత డాక్టర్‌తో కలిసి ఘటన జరగడానికి ముందు భోజనం చేశారు. ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి స్టేట్‌మెంట్లు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. 

డాక్టర్‌ హత్యాచారానికి గురవడానికి ముందు, తర్వాత ముందుగా వీరే చూశారు. సాక్ష్యాలను తారుమారు  చేయడానికి వీళ్లు ఏమైనా ప్రయత్నించారా? అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా తెలుసుకోవాలని దర్యాప్తు సంస్థ సీబీఐ భావిస్తోంది. ఇక.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు కోల్‌కతా హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)