Breaking News

ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త.. వీడియో షేర్‌ చేసిన కేంద్రమంత్రి

Published on Mon, 01/06/2025 - 08:20

ఈటానగర్‌: దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నదులు, సరస్సులు మంచుతో గడ్డ కడుతున్నాయి. ఇక, పలు పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల వారు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యాటకులు ప్రమాదానికి గురైన వీడియోను కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుందరమైన సెలా పాస్ వద్ద సరస్సు మంచుతో గడ్డకట్టింది. దీంతో,.సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం సరస్సు వద్దకు వెళ్లిన పర్యాటకుల బృందం అక్కడికి చేరుకుంది. అనంతరం, వారు సరస్సులోకి దిగారు. ఒకచోట గడ్డకట్టిన మంచు పగుళ్లు రావడంతో కొందరు పర్యాటకులు గడ్డకట్టిన నీటిలో​ పడిపోయారు. దీంతో, మంచు గడ్డ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న పర్యాటకులు వారిని కాపాడారు.

ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు(Kiren Rijiju) ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఈ సందర్బంగా కిరణ్‌ రిజుజు.. గడ్డకట్టిన ప్రదేశాల వద్దకు పర్యాటకులు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో స్థానిక గైడ్స్‌ సలహాలు తీసుకోవడం మంచిది. మంచుపై నడిచే సమయంలో హిమాపాతం గురించి తెలుసుకోండి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కారణంగా వెచ్చని బట్టలు ధరించి ఆనందించండి. మీ భద్రత ముఖ్యం అంటూ కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు