Breaking News

35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు!

Published on Sun, 04/23/2023 - 09:10

చండీగడ్‌: 35 రోజులుగా పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్‌ పంజాబ్‌ దే' చీఫ్‌ అమృత్‌ పాల్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం  మోగా జిల్లాలోని  ఓ గురుద్వార్ అతడు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. చాకచక్యంగా చుట్టుముట్టి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు అతడు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

అయితే అమృత్‌పాల్ సింగ్ తనంతట తానే పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులపైకి ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయేలదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అతని లొంగిపోడవం తప్ప మరో ఆప్షన్ లేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అతనిపై ఎన్‌ఎస్‌ఏ వారెంట్ జారీ అయినట్లు పేర్కొన్నారు.

పంజాబ్‌ పోలీసులు అమృత్‌ పాల్‌ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.  ఇప్పటికే అరెస్టైన అతని అనుచరులను కూడా పంజాబ్‌ నుంచి వేరే రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం. అమృత్‌పాల్ అత్యంత సన్నిహితుడు పాపల్‌ ప్రీత్ సింగ్‌ను కూడా అసోం దిబ్రూగఢ్‌ సెంట్రల్‌ జైలులోనే ఉంచారు.

అమృత్‌పాల్‌ సింగ్‌ను అత్వి త్వరలోనే అరెస్టు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారమే వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో అతను స్వేచ్ఛగా తిరిగేవాడని, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆ మరునాడే పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్టు చేశారు.

విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్ సింగ్‌ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అతడి కోసం వేల మంది పోలీసులు నెలరోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అయినా వేషాలు, వాహనాలు మార్చుతూ అతడు ఎవరికంటాపడకుండా తిరిగుతున్నాడు.  అమృత్ పాల్‌ పరారీలో ఉన్నప్పటి నుంచి అతడి అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు పోలీసులు. మఖ్య సన్నిహితుడు పాపల్‌ ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 15న జోగా సింగ్‌ను,  ఏప్రిల్‌ 18న మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. 

ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన మద్దతుదారులు పోలీస్‌ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు అమృత్‌పాల్ . వీరంతా ఫిబ్రవరి 23న పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్‌ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. అతనికి చెందిన ఆయుధాలు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

చదవండి: మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)