Breaking News

‘ మోదీ జీ.. నా తనయుడి కేసును కాగితంగానే మిగిలిపోనివ్వకండి’

Published on Tue, 07/14/2026 - 15:07

పూణే: మహారాష్ట్రలోని పూణేలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితుడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ భావోద్వేగ లేఖ రాశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూసి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు.

గత జూన్ 18న  కేతన్‌తో వివాహం జరగాల్సిన సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి, వారిని అరెస్ట్ చేశారు. కేతన్ మృతిచెందిన 20 రోజులకే, ఆ బాధను తట్టుకోలేక అతని తాత కన్నుమూశారు. దీనిపై రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేస్తూ, కొద్దిరోజుల వ్యవధిలోనే తమ కుటుంబం రెండు తరాలను కోల్పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిరోజూ తమ ఇల్లు కేతన్ జ్ఞాపకాలతో ‍ప్రతిధ్వనిస్తోందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఆశించడం లేదని, కేవలం సత్వర న్యాయం మాత్రమే కావాలని ఆమె ఆ లేఖలో కోరారు. కాగా ఇప్పటికే కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. దోషులకు చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా ప్రధాని వ్యక్తిగతంగా చొరవ చూపాలని బాధితుని తల్లి విజ్ఞప్తి చేశారు. కేతన్‌ హత్య కేసును కేవలం కాగితంగానే  మిగిలిపోనివ్వకండి’ అని లేఖలో విన్నవించారు.

ఇది కూడా చదవండి: ‘భోజశాల’పై సుప్రీం తీర్పు.. నమాజ్‌కు నిరాకరణ

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)