Breaking News

సోషల్ మీడియా పోస్ట్.. యువతి అరెస్ట్

Published on Wed, 01/21/2026 - 17:16

కొద్దిరోజుల క్రితం కేరళలో బస్సులో లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి వీడియో పోస్ట్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారడంతో అవమాన భారంతో ఆయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేరళ పోలీసులు ఆ వీడియో పోస్ట్ చేసిన యువతిని అరెస్టు చేశారు.

గత శుక్రవారం దీపక్(42) అనే వ్యక్తి కన్నూర్‌ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులోనే ఉన్న శింజితా ముస్తాఫా (35) అనే మహిళ తనను దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్త అక్కడ వైరల్‌గా మారడంతో అవమానభారంతో ఆ దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయువకుడి తప్పేమి లేదని యువతి ఫేమస్ కావాలనే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని యువకుడు తరపు బంధువులు కేసు పెట్టారు.

దీంతో ముస్తాఫా పరారైంది. తాజాగా ఆమెను తన బంధువుల ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో ఎడిటడ్‌దని ఆ పూర్తి వీడియోని సైబర్ విభాగం రివవరీ చేసి చూస్తుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

ఈ ఘటనపై  గతంలో శింజితా ముస్తాఫా  స్పందిస్తూ " నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు నన్ను అదేపనిగా తాకాడు. అది అపార్థంగా అనుకోకుండా జరిగింది కాదు. కావాలనే అలా చేశాడు ఇది ఖచ్చితంగా తప్పే నాకు అతను తాకడం ఇబ్బందిగా అనిపించిన తర్వాత రికార్డింగ్ చేయడం ప్రారంభించాను అయినప్పటికీ అతను తాకాడు" అని  తెలిపింది.

అయితే ఈ వివాదం రెండురోజుల తర్వాత దీపక్ తన ఇంటివద్ద ఉరివేసుకొని చనిపోయాడు. దీంతో అతను చాలా అమాయకుడని అన్యాయంగా తన కొడుకుపై అపనింద వేశారని అతని తల్లిదండ్రులు రోదించారు. దీనిపై కేరళ మానవహక్కుల సంఘం సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్రవిచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)