Breaking News

దెయ్యం పట్టిందని మద్యం, బీడీ తాగించి, మహిళకు చిత్రహింసలు

Published on Sat, 11/08/2025 - 15:28

కేరళలో దారుణం చోటు చేసుకుంది. 21వ శతాబ్ధంలో శరవేగంగా పరుగులు  పెడుతున్న అత్యాధునిక సమాజంలో మూఢనమ్మకాల ఆనవాళ్లు ఇంకా బలంగానే ఉన్నాయి అనడానికి ఊతమిచ్చే ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను దెయ్యం పేరుతో చిత్రహింసలకు గురి చేసిన వైనం దిగ్భ్రాంతి రేపింది.

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక యువతికి దెయ్యం పట్టిందంటూ మాంత్రికుడిని తమ ఇంటికి తీసుకొచ్చారు ఆమె అత్తింటి వారు, భర్త, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటూ మంత్రాలు, దెయ్యాలు పేరుతో  గంటల తరబడి శారీరక, మానసిక హింసకు గురి చేశాడా మాంత్రికుడు బలవంతంగా  మద్యం తాగించి, బీడీ తాగిస్తూ  నానా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారిపోయింది.  

దుష్టశక్తి ఆవరించిందంటూ ఉదయం 11.00గంటల నుంచి రాత్రివరకు  చిత్ర హింసలు పెట్టారని,  చివరికి స్పృహ కోల్పోయానని బాధితురాలు వాపోయింది. బలవంతంగా మద్యం ఇచ్చారని, బలవంతంగా బీడీ తాగించారని, "పవిత్ర బూడిద" తాగించారని, కాల్చడం సహా ఇతర రకాల శారీరక హింసలు పెట్టారని తెలిపింది.

చదవండి: ఎంపీకి స్కామర్ల షాక్‌ : ఎస్‌బీఐ నుంచి రూ.56 లక్షలు మాయం

బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళ భర్త, అత్తింటివారిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత  ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి  నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ప్రధాన నిందితుడైన మంత్రగాడు శివదాస్ (54)ని తిరువల్లలోని ముత్తూర్ ప్రాంతం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అరెస్ట్‌ అయినవారిలో మహిళ భర్త అఖిల్ దాస్ (26) , తండ్రి దాస్ (54) ఉన్నారు.

ఇదీ చదవండి: నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి

#

Tags : 1

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు