Breaking News

శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సద్య..!

Published on Mon, 12/22/2025 - 11:55

అన్నదానం కార్యక్రమంలో భాగంగా , శబరిమల వద్ద అయ్యప్ప భక్తులకు సాంప్రదాయ కేరళ సద్య పంపిణీ ఈ నెల డిసెంబర్‌21 నుంచి ప్రారంభమైంది. దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ OG బిజు ఉత్సవ దీపం వెలిగించి , అయ్యప్ప స్వామికి సద్యను నివేదించి మరి సేవను ప్రారంభించారు.

ఈ విందు కేరళ అసలైన రుచిని ప్రతిబింబిస్తుంది. ఇందులో పరిప్పు , సాంబార్ , రసం , అవియల్ , తోరన్ , ఊరగాయ , పప్పడం, పాయసం ఉంటాయి. వైవిధ్యం, తాజాదనాన్ని కాపాడుకోవడానికి , అవియల్, తోరన్లను ప్రతిరోజూ భిన్నంగా తయారు చేస్తారు. అయితే మోర్ , రసం లేదా పులిస్సేరిని ఒకరోజు విడిచి ఒకరోజు వడ్డిస్తారు. అలాగే ప్రతిరోజూ కొత్త రకం పాయసం కూడా అందిస్తారు.

పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా , స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఉపయోగించి ఆహారాన్ని వడ్డిస్తారు. ప్రతి మధ్యాహ్నం సుమారు 5 వేల మందికి పైగా యాత్రికులకు భోజనం అందిస్తారు. సాంప్రదాయ సద్య, పులావ్‌ను ప్రత్యామ్నాయ రోజులలో వడ్డిస్తారు.

ప్రారంభ సాంకేతిక జాప్యాలను పరిష్కరించిన తర్వాత, అధికారులు ఇప్పుడు ఈ గొప్ప సేవను కొనసాగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కేరళ  గొప్ప వంటకాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సేవను ప్రారంభించారు. 

(చదవండి: చెత్తను కొనుగోలు చేసే తొలి గ్రామం..అందుకోసం ఏకంగా యాప్‌..!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)