Breaking News

కోనేరులో కాళ్లు కడిగిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి

Published on Tue, 08/26/2025 - 12:02

దేశంలో ప్రసిద్ది పొందిన శ్రీకృష్ణ ఆలయాల్లో కేరళ త్రిసూర్ గురువాయూర్‌ దేవాలయం ఒకటి. ఓటీటీ సినిమాలతో ఈ ఆలయం తెలుగువారికి సుపరిచితమే. అలాంటిచోట అపవిత్రం జరిగిందంటూ మంగళవారం ఆలయ శుద్ధి పనులు చేపట్టారు నిర్వాహకులు. ఓ మహిళా యూట్యూబర్‌ అతిచేష్టలే అందుకు కారణంగా తెలుస్తోంది.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జాస్మిన్‌ జాఫర్‌.. వారం కిందట గురువాయూర్‌ ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో కోనేరులో కాళ్లు కడుగుతూ.. ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ వీడియో తీసుకుని సోషల్‌ మీడియాలో రీల్‌ రూపేణా పోస్ట్‌ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో తీవ్ర దుమారం రేగింది.

గురువాయూర్‌ ఆలయంలో ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం నిషేధం!. దీంతో నిబంధనలను ఉల్లంఘించి మరీ  ఆచారాన్ని మంటగలిపిందంటూ పలువురు ఆమె చర్యపై మండిపడ్డారు. ఒక హిందూయేతర మహిళ.. అందునా ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఇటు ఆలయ నిర్వాహకులు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో..

రుద్రతీర్థం(కోనేరు పేరు) అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దైవదర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అంతేకాదు.. ఘటన జరిగి ఆరు రోజులు కావస్తుండడంతో.. ఈ ఆరురోజులపాటు జరగాల్సిన 18 పూజలు, 18 శీవెలీలు తిరిగి నిర్వహిస్తున్నారు. పూజలన్నీ పూర్తయ్యాకే నలంబలంలో(గురువాయూర్‌ సమీపంలోని నాలుగు ఆలయాలు) ప్రవేశానికి అనుమతిస్తామని.. కాస్త ఓపికగా సహకరించాలని భక్తులకు దేవస్థానం వారు విజ్ఞప్తిచేశారు.

మరోవైపు ఈ ఘటనపై పాలనాధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లంఘించి మరీ ఆమె వీడియో తీసిందని మండిపడ్డారు. పవిత్రత రిత్యా కోనేరు సహా ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రాంతాల్లో  ఎలాంటి చిత్రీకరణలకు వీల్లేదని గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 

జాస్మిన్‌ జాఫర్‌(25).. యూట్యూబర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌. ఆమెకు సోషల్‌ మీడియాలో మిలియన్నర ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ ఫేమ్‌తోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ సీజన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా ఆమె నిలిచింది. అటుపై ఆమె ఫేమ్‌ మరింత పెరిగింది. అయితే తాజా వివాద నేపథ్యంలోనే ఆ వీడియో తొలగించిన జాఫర్‌.. ఆ పరిమితుల గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని తప్పు ఒప్పుకుంది.

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు