Breaking News

కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి!

Published on Sat, 08/01/2026 - 10:33

ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా పలుచోట్ల సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇడుక్కి జిల్లా వాగమండ్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడటంతో వైకోమ్‌కు చెందిన ప్రభాకరన్ నాయర్ మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అదూర్మలలో మరో కొండచరియ విరిగిపడటంతో ఒక వ్యక్తి గల్లంతయ్యారు. కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై అడిమాలి సమీపంలోని మాచిప్లావు వద్ద కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 

మరోవైపు కొట్టాయం జిల్లా పయ్యనితోటంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా, అతని తల్లి శిథిలాల కింద కూరుకుపోయారు. జోసెఫ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, అతని తల్లి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉప్పుతుర ప్రాంతంలో పుల్లకాయరు నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొక్కయార్ వంతెన మునిగిపోయింది. చుట్టుపక్కల ఆరు ఇళ్లు జలమయం కావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఎరట్టుపేట, కాంజిరపల్లి, కూట్టిక్కల్, ఎరుమేలి ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వందలాది నివాసాలు నీట మునిగాయి. ఎరట్టుపేటలో అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని చిన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేశారు.

ఇది కూడా చదవండి: కుల్గామ్ ఉగ్రదాడి: ఆస్పత్రిలో మరో కార్మికుడు మృతి

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)