Breaking News

Kerala: అసెంబ్లీకి ‘స్వర్ణ తాపడం’ వివాదం.. గందరగోళం మధ్య సభ వాయిదా

Published on Mon, 10/06/2025 - 12:23

తిరువనంతపురం: శబరిమల స్వర్ణ తాపడం వివాదం కేరళ అసెంబ్లీని మరింత వేడెక్కించింది. శబరిమల ఆలయంలోని గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయనే ఆరోపణలతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. దీంతో సోమవారం శాసనసభలో హై డ్రామా నడిచింది. ఈ గందరగోళం నడుమ స్పీకర్  ఏఎన్‌ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.

సభలో తొలుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శబరిమల స్వర్ణ తాపడం అంశాన్ని లేవనెత్తారు. గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయని ఆరోపిస్తూ, ఇందుకు బాధ్యత వహిస్తూ దేవస్వం(దేవాదాయశాఖ) మంత్రి, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు వీఎన్ వాసవన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వెంటనే కలుగజేసుకుని ప్రశ్నోత్తరాల సమయంలో షెడ్యూల్ చేసిన ప్రశ్నలను అడగాలని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.

‘అయ్యప్పన్ బంగారం చోరీ, దోపిడీదారులు ఆలయాన్నే స్వాహా చేశారు’ లాంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్‌లను ప్రతిపక్ష సభ్యులు తమ చేత పట్టుకుని,  స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడున్న మంత్రులు, పాలకవర్గ సభ్యులు తమ సీట్ల నుండి లేచి నిలుచున్నారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రతిపక్ష సభ్యుల చర్యలను ఖండించారు. సభలో ఈ విధంగా అంతరాయం కలిగించడం  సరైనది కాదన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని, ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోవడం సభను అగౌరవపరచడమేనన్నారు.

సభ్యులు తమ చేతుల్లోని ప్లకార్డులను దించాలని ఆయన ఆదేశించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. ఈ గందరగోళం  నడుమ స్పీకర్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను వాయిదా వేశారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సభలో ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత వారంలో ప్రతిపక్షం ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. అయితే స్పీకర్ ఈ అంశం కేరళ హైకోర్టు పరిశీలనలో ఉందని పేర్కొంటూ, దానిని తోసిపుచ్చారు. కాగా రాబోయే రోజుల్లో శబరిమల స్వర్ణ తాపడం వివాదంపై తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రతిపక్ష సభ్యులు ప్రకటించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)