Breaking News

ఎన్‌ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు

Published on Tue, 12/19/2023 - 21:18

చంఢీగడ్‌: కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్‌ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది.

కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్‌, జైపూర్‌లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. 

ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్‌దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. 

ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)