Breaking News

అంతిమసంస్కారాలైన 25 ఏళ్లకు ఆమె తిరిగొస్తే..

Published on Tue, 12/24/2024 - 12:27

ఆమె తన ఆచూకీని కోల్పోయి 25 ఏళ్లుగా ఆశ్రమంలో కాలం గడుపుతోంది. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి ఈ ఆశ్రమానికి వచ్చిందన్న సంగతి ఆ ఆశ్రమ నిర్వాహకులకూ తెలియదు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నగరానికి చెందిన కథనం

ఏళ్ల తరబడి ఆశ్రమంలో..
పాతికేళ్ల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆమె తన కుటుంబాన్ని కలుసుకోగలుగుతోంది. మండి పరిపాలన అధికారుల చొరవతో ఇది సాధ్యమయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు 25 ఏళ్ల క్రితమే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక వాసి సాకమ్మ కథ ఇది. పాతికేళ్ల క్రితం ఆమె కర్ణాటక(Karnataka) నుండి ఉత్తర భారతదేశయాత్రలకు వెళ్లి,  అక్కడ తప్పిపోయింది. అప్పటి నుంచి ఆమె మండి జిల్లా సుందర్‌నగర్‌లోని భంగ్రోటు వృద్ధాశ్రమంలో ఉంటోంది.

కన్నడలో మాట్లాడటంతో..
మండి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆశ్రమాలను సందర్శించి, అక్కడ సౌకర్యాలను  పరిశీలిస్తుంటారు. దీనిలో భాగంగా అధికారి రోహిత్ రాథోడ్ ఇటీవల ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సాకమ్మను చూసి, ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమెకు హిందీ రాదని, కన్నడ భాష వచ్చని గుర్తించారు. దీంతో ఆమె కర్నాటకు చెందినదై ఉంటుందని భావించారు. వెంటనే ఆయన కన్నడ తెలిసిన ఒక అధికారిని పిలిపించి, ఆమెతో మాట్లాడించి పలు వివరాలు సేకరించారు.

ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లి..
తరువాత ఆ మహిళ చెబుతున్న వివరాలతో కూడిన  ఒక వీడియో(Video)ను రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి పంపించారు. ఆ దరిమిలా ఆమె కుటుంబ సభ్యులను మండీ అధికారులు గుర్తించారు. కాగా 25 ఏళ్ల క్రితం ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లిన సాకమ్మ ఎంతకాలానికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దరిమిలా పోలీసులు అందించిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక మహిళను సాకమ్మగా భావించి, ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, క్రమంగా ఆమెను మరచిపోయారు.

చనిపోయిందనుకున్న తల్లి వస్తుండటంతో..
అయితే ఇప్పుడు సాకమ్మ బతికే ఉందని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా మండీ అధికారులతో మాట్లాడిన సాకమ్మ  తనకు 25 ఏళ్ల క్రితం నాటి విషయాలు మాత్రమే గుర్తున్నాయని, తనకు చిన్న పిల్లలు ఉన్నారని  తెలిపింది. ప్రస్తుతం సాకమ్మ మతిస్థిమితం లేని స్థితిలో ఉంది. కాగా సాకమ్మకు నలుగురు పిల్లలు.  వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె బతికే ఉన్నారు. వారిందరికీ వివాహాలు కూడా అయిపోయాయి. సాకమ్మను తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) ముగ్గురు అధికారులను హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి పంపింది. వారు సాకమ్మకు తీసుకుని కర్నాటకకు వచ్చి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఇది కూడా చదవండి: ఆవి క్రిస్మస్‌ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)