Breaking News

లోన్‌ రికవరీ కోసం వచ్చిన సిబ్బంది.. కర్రలతో బెదిరించిన మహిళలు!

Published on Mon, 06/19/2023 - 16:57

మాలూరు(బెంగళూరు): రుణాల వసూళ్లకు వచ్చిన డీసీసీ బ్యాంకు సిబ్బందిని మహిళలు కర్రలతో అడ్డుకుని బెదిరించిన ఘటన తాలూకాలోని రాజేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాస్తి ఫిర్కా దిన్నేరి హారోహళ్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ పత్తిన సహకార సంఘం 2023 ఫిబ్రవరిలో రాజేనహళ్లి గ్రామానికి చెందిన ఏడు సీ్త్రశక్తి సంఘాలకు రూ. 5 లక్షల ప్రకారం మొత్తం రూ. 35 లక్షలు వడ్డీ రహిత రుణాలు ఇచ్చారు.

రుణాలు తీసుకున్న మహిళలు ప్రతి నెలా రుణాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళా స్వసహాయ సంఘాల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ రుణాలు మాఫీ చేస్తుందనే విశ్వాసంతో మహిళలు ఉన్నారు. దీంతో రుణాల వసూళ్ల కోసం వచ్చిన అధికారులను, సిబ్బందిని ప్రతి గ్రామంలోను మహిళలు అడ్డుకుంటున్నారు.

గతంలో మహిళలు స్వయం ప్రేరితంగా రుణాలు చెల్లించే వారు, అయితే గత నెల రోజుల నుంచి మహిళా సంఘాల సభ్యులు ఎవరూ రుణాలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రుణాల వసూళ్ల కోసం వెళ్లిన దిన్నేరి హారోహళ్లి సహకార సంఘం కార్యదర్శి తిరుమేగౌడ, గుమాస్తా శ్రీనివాస్‌, అకౌంటెంట్‌ చిత్రలను మహిళా సంఘాల సభ్యులు కర్రలతో అడ్డుకుని బెదిరించారు. రుణాలు వసూళ్లకు ఎందుకు వస్తారని సిబ్బందిని నిలదీశారు. ఏం చేస్తారో చేసుకోండని అన్నారు.

చదవండి: కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు..

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి