Breaking News

భార్య, పిల్లలను కడతేర్చి ఆత్మహత్య

Published on Wed, 07/22/2026 - 07:29

కర్ణాటక : జిల్లాలోని హుణసూరు పట్టణంలో హృదయ విదారక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలే కారణమని అనుమానాలున్నాయి.  

వివరాలు... పట్టణంలోని న్యూ మారుతి బరంగాయ్‌కు చెందిన హరీష్‌ (49), భార్య నిష్ఠ (36), పిల్లలు నిక్షా (12), రక్ష (8)తో నివసిస్తున్నాడు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే హరీష్‌ , మూడు రోజుల క్రితం తన తల్లిని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాడు. సోమవారం రాత్రి కింది అంతస్తులో తన భార్య, పిల్లల ముక్కులకు, నోళ్లకు ప్లాస్టర్‌ అతికించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మొదటి అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిందని అనుమానిస్తున్నారు.  

ఇరుగుపొరుగు అనుమానంతో..  
మంగళవారం ఉదయం 9 గంటలైనా తలుపులు తెరవకపోవడతో ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూసి ఏదో జరిగిందని కనుగొన్నారు. పట్టణ పోలీసులకు తెలుపగా తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించారు. నలుగురి మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభించిన డెత్‌ నోట్‌ను   స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫలానా ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరికి ఇవ్వాలో అందులో రాశాడు. పూర్తి లేఖ బయటకు రాలేదు. ఇరుకుటుంబాల బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.   

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)