Breaking News

'పాక్‌కు వెళ్లండి..' టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sun, 09/03/2023 - 13:58

బెంగళూరు: కర్ణాటకాలో ఓ టీచర్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబంతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ ఘటన జరిగింది. 

ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కన్నడ భాష క్లాస్‌ జరుగుతుండగానే అల్లరి చేశారు. ఒకరిపై మరొకరు ఘర్ణణకు దిగారు. దీంతో విసిగిపోయిన కన్నడ భాష బోధించే టీచర్.. విద్యార్థులను పాకిస్థాన్‌కు వెళ్లాలని.. ఇది హిందూ దేశమని అన్నారు. సదరు టీచర్‌ను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 

ఉర్దూ స్కూల్‌లో ఆ టీచర్ ఎనిమిదేళ్లుగా బోధిస్తున్నారని, మొత్తం 26 ఏళ్ల అనుభవం ఉన్నట్లు గుర్తించారు. ఆమె రెగ్యులర్ ఉద్యోగిని అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ ఘటనల తర్వాత మళ్లీ కర్ణాటకాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. చివరికి పిల్లాడిని దండించాలనే తప్పా మతపరమైన ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో తరగది గదిలో ఓ టీచర్ విద్యార్థులను పాక్‌కు వెళ్లాలని సూచించారు. అనంతరం మళ్లీ కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. 

ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స..


 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)