Breaking News

ఓటుకు రూ.80 వసూలు.. ఓట్‌ చోరులను గుర్తించిన కర్నాటక సిట్‌

Published on Fri, 10/24/2025 - 07:25

బెంగళూరు: 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ల్లో అలంద్‌ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోప లు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తెలిపింది. ఓటర్ల పేర్లను తొలగించే కుంభకోణంతో కనీసం ఆరుగురికి సంబంధమున్నట్లు గుర్తించింది.

ఇక, వీరికి ఓ డేటా సెంటర్‌తో సంబంధాలున్నాయని, వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ ద్వారా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించారని సిట్‌కు సారథ్యం వహించిన సీఐడీ అద నపు డీజీ బీకే సింగ్‌ చెప్పారు. పేర్లను తొలగించాలంటూ అందిన మొత్తం 6,994 అభ్యర్థన ల్లో ఏవో కొన్ని మినహా చాలామటుకు బోగస్‌ వేనని గుర్తించామన్నారు. అలంద్‌లో ఓటర్ల తొలగింపునకు కుట్ర జరిగింది వాస్తవమని చెప్పారు. మొత్తం 30 మంది వరకు ప్రశ్నించి, అనుమానితులుగా ఆరుగురిని నిర్ధారించామని, వీరిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని వివరించారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిపామన్నారు.

ఇందులో అప్పట్లో అలంద్‌లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన సుభాష్‌ గుత్తేదార్, ఆయన ఇద్దరు కుమారుల ఇళ్లు కూడా ఉన్నాయన్నారు. సోదాల సమయంలో సుభాష్‌ ఇంటికి సమీపంలో కాలిపోయిన ఓటరు జాబితాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. అయితే, దీపావళి సందర్భంగా తమ సిబ్బంది వృథా వస్తువులను తొలగించే క్రమంలో పనికి రాని ఓటరు జాబితాలను సైతం కాల్చేశారని సుభాష్‌ గుత్తేదార్‌ వివరించారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదన్నా రు.

ఇలా ఉండగా, అలంద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి పరిధిలోనిదే కావడం గమనార్హం. అలంద్‌లో ఓట్‌ చోరీ జరిగినట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ ఇటీవల చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తు కోసం కర్నా టకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. కాగా, అలంద్‌ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగాయని మంత్రి ప్రియాంక్‌ ఖర్గే గురువారం ఆరోపించారు. వాటిపైనా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. ఈ ముఠా ఓటుకు రూ.80 చొప్పున వసూలు చేసిందన్నారు. ఇదంతా బీజేపీ నేతలు పాల్పడిన కుంభకోణమేనన్నారు. బాధ్యులను కటకటా ల్లోకి నెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, అప్పట్లో చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి అడ్డుకోవడం వల్లే ఓట్ల తొలగింపు కుంభకోణానికి బ్రేకులు పడ్డాయని అలంద్‌లో 10వేల ఓట్ల తేడాతో గెలుపొందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బీఆర్‌ పాటిల్‌ తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)