Breaking News

ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ?

Published on Mon, 05/15/2023 - 07:54

సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి తనకే దక్కేలా సీఎల్పీ నేత సిద్దరామయ్య రహస్య సమావేశాలకు నాంది పలికారు. బెంగళూరులోని ఓ భవనంలో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించనున్నారని సమాచారం. ఎం.బీ.పాటిల్, జమీర్‌ అహమ్మద్‌ఖాన్, ఉత్తర కర్ణాటకకు ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశముంది. మరోవైపు కొత్త సీఎంకు శుభాభినందనలు అని సిద్దు ఇంటి ముందు కొందరు అభిమానులు పోస్టర్లు కట్టారు.  

సిద్దును కలిసిన లత   
హరపనహళ్లి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన లతా మల్లికార్జున, సిద్దరామయ్యను భేటీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఫోటోను ట్వీట్‌ చేసిన సిద్దరామయ్య, విజయం సాధించిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు.  
చదవండి: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు..

దొడ్డ కాంగ్రెస్‌లో విచారం
దొడ్డ కాంగ్రెస్‌లో విషాద ఛాయలు అలముకొన్నాయి. వరుసగా రెండుసార్లు  ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణయ్య ఓడిపోవడం ఏమిటని కార్యకర్తలు దిగులు చెందారు.  గెలుపు కచ్చితమని మెజారిటీనే తేలాల్సి ఉందని, ఆయన మంత్రి కావడమే ఆలస్యమని కార్యకర్తలు, అభిమానులు ప్రచారం చేసుకుంటే తీరా ఫలితాల్లో ఓడిపోయారు. మొదటిసారి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ధీరజ్‌ మునిరాజు రాష్ట్రంలో ఆ పార్టీకి వ్యతిరేకత ఉన్నా 31 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో కాంగ్రెస్‌ కంగుతింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టబోతున్నా విజయోత్సవం చేసుకోలేని పరిస్థితిలో దొడ్డ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో నెలమంగల, దేవనహళ్లి, హొసకోట తాలూకాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎన్నికై సత్తా చాటారు. ఒక్క దొడ్డలో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీ ఆఫీసు వెలవెలబోతోంది. కాంగ్రెస్‌ హవా ఉన్నా ఓడిపోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)