Breaking News

మెత్తబడ్డ డీకే శివకుమార్‌!.. కీలక వ్యాఖ్యలు

Published on Fri, 11/28/2025 - 18:47

కర్ణాటక పవర్‌ పాలిటిక్స్‌లో పూటకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. ఐదేళ్లు తానే సీఎంనంటూ సిద్ధరామయ్య.. అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఇటు డీకే శివకుమార్‌లు పోటాపోటీగా ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ పంచాయితీ ఢిల్లీకి రేపోమాపో షిఫ్ట్‌ అవుతుందనే ప్రచారం ఇవాళ జోరుకుంది. అయితే ఈలోపే..

కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. పదవీ త్యాగం నేపథ్యంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  బెంగళూరులో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2004లో అధికారాన్ని త్యాగం చేశారు. తనకు బదులుగా మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేశారు’’ అని అన్నారాయన.

కర్ణాటకలో అధికార పంపిణీపై ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే విశ్లేషణ అక్కడ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగి కర్ణాటక కాంగ్రెస్‌ సంక్షోభం మరింత ముదరకుండా మంతనాలు జరుపుతున్నారు. సీఎం మార్పు నిర్ణయాన్ని ఇక సోనియా గాంధీకే వదిలేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంతో అధిష్టానంతో చర్చించేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. 

ఈలోపు రాహుల్‌ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ కర్ణాటక పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకమాండ్‌ పిలిస్తే కచ్చితంగా ఢిల్లీ వెళ్తా. అధిష్టాన నిర్ణయమే నాకు ఫైనల్‌. ఏ విషయంలోనూ నాకు తొందరలేదు’’ అని అన్నారు. మరోవైపు.. డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటోను సిద్ధరామయ్య షేర్‌ చేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యిందా? అనే చర్చ జోరందుకుంది.

సీఎం చేంజ్! ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల కీలక సమావేశం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)