Breaking News

మణిపూర్‌ అమ్మాయిల బాధ్యత నాదే.. మంత్రి మంచి మనసు

Published on Tue, 08/01/2023 - 21:19

బెంగళూరు:  మణిపూర్‌ శరణార్థుల విషయంలో కర్ణాటక మంత్రి జమీర్‌ అహ్మద్‌ మంచి మనసు చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 29 మంది మణిపూర్‌ అమ్మాయిల బాధ్యతలను తీసుకుంటున్నట్లు ప్రకటించారాయాన.

మణిపూర్‌ అల్లర్ల కారణంగా.. మణిపూర్‌ నుంచి చాలామంది ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారు.  ఆ రాష్ట్రం నుంచి కొందరు కర్ణాటక చామరాజ్‌పేట సెయింట్‌ థెరెస్సా  విద్యాసంస్థల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్లలో 29 మంది చదువుకునే వయసున్న అమ్మాయిలు ఉన్నారు. 

ఆగష్టు 1వ తేదీన జమీర్‌ అహ్మద్‌ పుట్టినరోజు.  ఈ సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఆ అమ్మాయిలతో మాటామంతీ కలిపిన ఆయన వాళ్ల పరిస్థితికి చలించిపోయారు. తక్షణ సాయంగా రూ.2 లక్షలను ప్రకటించారాయన. ‘‘వాళ్ల చదువులు పూర్తి కావాలంటే ఏడేళ్లు పూర్తి కావొచ్చు. ఈ ఏడేళ్ల కాలంలో వాళ్లకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. వాళ్లు ఇక్కడ ఉన్నంత కాలం సురక్షితంగా ఉండొచ్చు’’ అని ప్రకటించారాయన. 

జమీర్‌ అహ్మద్‌ ‘నేషనల్‌ ట్రావెల్స్‌’ భాగస్వామ్య యాజమాని. చామరాజ్‌పేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారాయన. అందులో మూడుసార్లు జేడీఎస్‌ నుంచి.. రెండుసార్లు కాంగ్రెస్‌ తరపున నెగ్గారు. ప్రస్తుతం హౌజింగ్‌ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారాయన.  

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు