Breaking News

సంచలనం.. ‘హనీట్రాప్‌’లో 48 మంది ఎమ్మెల్యేలు.. సీడీలు,వీడియోలు కూడా

Published on Thu, 03/20/2025 - 21:45

బెంగళూరు:  ‘హాయ్‌..మైనేమ్‌ ఈజ్‌ సుజి(పేరు మార్చాం). వాట్‌ ఈజ్‌ యువర్‌ నేమ్‌. వేర్‌ ఆర్‌ యు ఫ్రమ్‌. ఐ యామ్‌ సింగిల్‌...’ అంటూ యువతుల్ని ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్‌ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పడీ హనీ ట్రాప్‌ వలలో సుమారు 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారని ఓ రాష్ట్ర  మంత్రి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ అంశంపై దుమారం చెలరేగింది.   

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల కర్ణాటకలో ఇద్దురు మంత్రులపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్‌ జార్కిహొళి అసెంబ్లీలో వెల్లడించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారు

అంతేకాదు, సీఎం సిద్ధరామయ్య సన్నిహితుడు, కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్నపై రెండు సార్లు హనీట్రాప్‌ జరిగిందని ఇదే అంశంపై రాష్ట్ర హోంశాఖ విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా నేతల్ని హనీట్రాప్‌లోకి దించడం పరిపాటిగా మారింది. ఈ తరహా రాజకీయాలు చేయకూడదు. కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలన్నారు.  

హనీ ట్రాప్‌పై కేఎన్‌ రాజన్న మాట్లాడుతూ..  హనీట్రాప్‌లో కనీసం 48 మంది ఎమ్మెల్యేలు పడ్డారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఇది కొత్త విషయం కాదు. వారిలో చాలామంది హైకోర్టులో స్టే తీసుకున్నారు. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హనీ ట్రాప్‌ సూత్రదారులు, పాత్రదారులెవరో తెలుసుకోవాలని అన్నారు.  ప్రస్తుతం, ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ హనీట్రాప్‌పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)