Breaking News

ఐపీఎస్‌ రూపా Vs ఐఏఎస్‌ రోహిణి.. అసలు ఎందుకీ వివాదం?

Published on Mon, 02/20/2023 - 07:47

బనశంకరి/ శివాజీనగర(కర్ణాటక): కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్‌ మధ్య సోషల్‌ మీడియా యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్‌ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్‌ డి. రూపా మౌద్గిల్‌ ఫేస్‌బుక్‌లో తీవ్ర విమర్శలతో ఆదివారం పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్‌ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్‌ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు.

నాకు ఏజీ ఎందుకు వాదించలేదు?  
గతేడాది మైసూరు కలెక్టర్‌గా పనిచేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్‌లో కేసు వేయగా, ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్‌ చేశారు. తాను 3 సంవత్సరాల కిందట యాదగిరిలో పనిచేసి, బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్‌లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు అన్నారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్‌లకు పంపించారని, ఇది సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించడమేనని, ఇంకా అనేక ఆరోపణలను రూపా సంధించారు.   

మానసిక వైద్యం చేయించుకో: రోహిణి  ఆగ్రహం 
ఐపీఎస్‌ రూప నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై న్యాయపోరాటం చేస్తానని ఐఏఎస్‌ రోహిణి సింధూరి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు.  రూపా మౌద్గిల్‌ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు.

ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నేను వ్యక్తిగత ఫొటోలను ఎవరికి పంపించాను అనేది ఆమె బహిరంగపరచాలని, బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇష్టానుసారం నా ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిందని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారం రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.
చదవండి: ఎస్‌ఐ పాడుపని.. షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కాలేజీ అమ్మాయి 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)