Breaking News

ఎంత విషాదం.. తొలి పోస్టింగ్‌కు వెళుతూ యువ ఐపీఎస్‌ దుర్మరణం

Published on Mon, 12/02/2024 - 12:09

రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.

తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఐపీఎస్‌ అధికారి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైనింగ్‌ పూర్తి చేస్తుకున్న అతడు..తన తొలి పోస్టింగ్‌ను చేపట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం మరింత దురదృష్టకరం. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల హర్ష్‌ బర్దన్‌ క్ణాటక కేడర్‌కు చెందిన 2023 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. 

సోమవారం తన తొలి పోస్టింగ్‌ స్వీకరించేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పోలీస్‌ వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి అనంతరం చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బర్దన్‌ తలకు బలమైన గాయం తగలంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువ ఐపీఎస్‌ మరణించాడు. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి.

మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన స్థలంలో పోలీస్‌ వాహనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఐపీఎస్‌ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్ణకరమని అన్నారు.

‘హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ మృతి చెందడం బాధాకరం. ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతుండగా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్ణకరం. ఎన్నో ఏళ్లు శ్రమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుఉ ఇలా జరగకూడదు.హర్ష్ బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని కన్నడలో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

కర్నాటకలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మృతి

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)