Breaking News

‘నాన్నా క్షమించు.. పింకీ టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా’

Published on Mon, 01/27/2025 - 19:58

బెంగళూరు: దేశంలో భార్యా బాధిత మరణాలు పెరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య ఘటన మరువకముందే కర్ణాటక మరో వ్యక్తి ఇలానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్‌ రాసిపెట్టి చనిపోయాడు.

వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ సందర్భంగా తన మరణానికి భార్య పింకీనే కారణం అంటూ నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన పేరెంట్స్‌ను క్షమించమని కోరాడు. సూసైడ్‌ నోట్‌లో.. నాన్న, నన్ను క్షమించండి. పింకీ వేధింపులు భరించలేక నేను చనిపోతున్నాను. తను నా మరణాన్ని కోరుకుంటోంది. అన్నయ్య జోయల్‌.. మన పేరెంట్స్‌ను బాగా చూసుకో’ అంటూ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతరం, పీటర్‌ చనిపోయిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్బంగా పీటర్‌ సోదరుడు జోయల్ మాట్లాడుతూ..పీటర్‌, పింకీ రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. గత కొద్ది నెలలుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో, మూడు నెలలుగా వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. పీటర్‌ నుంచి పింకీ విడాకులు తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పీటర్‌ వద్ద పరిహారంగా రూ.20 లక్షలు డిమాండ్‌ చేసింది. దీంతో, పీటర్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. పింకీ వల్లే ఇటీవల పీటర్‌ తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఆమె వల్ల చాలా ఒత్తిడిలో ఉన్నట్టు తెలిపాడు.

పీటర్‌ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పీటర్‌ సూసైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పీటర్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించడంపై వ్యవహరించే భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)