Breaking News

COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం

Published on Sun, 06/01/2025 - 09:06

బెంగళూరు: దేశమంతటా కోవిడ్‌-19 కేసులు(Covid-19 cases) పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎవరైనా పిల్లలు జ్వరం, దగ్గు లేదా జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతుంటే వారిని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపవద్దని కోరింది.

ఈ ప్రకటన విడుదల చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  రాష్ట్రంలోని విద్యా సంస్థలలో(educational institutions) ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఇటువంటి నిర్ణయం తీసుకుంది.  విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా ఈ ప్రకటనను వెలువరించింది. ఫ్లూ లాంటి లక్షణాలు కలిగిన విద్యార్థులు పాఠశాలలకు రావద్దని, ఇంట్లోనే ఉంటూ తగిన వైద్య సంరక్షణ పొందాలని  తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కోవిడ్‌-19 సమీక్షా సమావేశం  అనంతరం పాఠశాలలకు ఈ ఆదేశాలను జారీ చేశారు.

చిన్నారులలో జ్వరం, దగ్గు, జలుబు(Fever, cough, cold) లేదా ఇతర లక్షణాలు గమనించినప్పుడు వారి తల్లిదండ్రులు తమ చిన్నారులకు తగిన చికిత్స అందించి, కోలుకున్నాకనే పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు పాఠశాలల్లో కోవిడ్-19 వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం, మాస్క్‌లు ధరించడం శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం లాంటివి అమలు చేయాలని సూచించింది. కర్ణాటకలో 230కి పైగా కోవిడ్‌-19 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆరోగ్య అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.  మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

ఇది  కూడా చదవండి: ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. పాక్‌తో సంబంధాలపై ఆరా

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)