Breaking News

మాజీ ఎమ్మెల్యేను కుమ్మేసిన ఎద్దు.. పోటీల్లో అపశృతి

Published on Sun, 10/26/2025 - 08:05

బెంగళూరు: కర్ణాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల పందెం పోటీల ఉత్సవం సందర్భంగా ఓ ఎద్దు.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తి పాడేసింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కర్ణాటకలోని శివమొగ్గలోని బల్లిగావిలో హోరీ హబ్బా అనే సాంప్రదాయ ఎద్దుల పందేల ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా శికారిపుర పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహాలింగప్ప, స్థానికులు ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక ఎద్దు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. ఇంతలో ఒక ఇంటి ముందే నిలుచున్న మాజీ ఎమ్మెల్యే మహాలింగప్పపైకి ఎద్దు దూసుకెళ్లింది. తన కొమ్ములతో అతడిని ఎత్తి పడేసింది. దీంతో, మహాలింగప్ప తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. అనంతరం, స్థానికుల.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలింగప్ప చికిత్స పొందుతున్నారు. ఇక​, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కర్ణాటకలో హోరీ అనేది ఒక సాంప్రదాయ గ్రామీణ క్రీడ. ఈ సందర్బంగా అలంకరించబడిన ఎద్దులను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులపైకి పరుగెత్తిస్తారు. ఇందులో పాల్గొనే కొంతమంది వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల క్రితం హోరీ పోటీల సమయంలో హవేరి జిల్లాలో నలుగురు మరణించారు. హవేరి, తిలవల్లి తాలూకాలతో సహా వివిధ ప్రాంతాలలో ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)