Breaking News

ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు

Published on Fri, 01/02/2026 - 11:47

మెజారిటీ ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా లేరని.. పక్కాగా పని చేస్తాయని నమ్ముతున్నారని కర్ణాటక నుంచి ఒక సర్వే విడుదలైంది. అయితే.. ఈ ఫలితం ఆధారంగానే కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇంతకాలం కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం ప్రజాభిప్రాయంతోనే బయటపడిందని ఎద్దేవా చేస్తోంది. ఈ తరుణంలో ఆ సర్వేకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక కాంగ్రెస్‌ ట్విస్ట్‌ ఇచ్చింది.

2024 లోక్‌సభ ఎన్నికలపై నిర్వహించిన ఈ సర్వేలో.. 83.61 శాతం మంది ఈవీఎంలు విశ్వసించదగినవేనని వెల్లడించారు. కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక మానిటరింగ్‌ అండ్‌ ఎవల్యూషన్‌ అథారిటీ దీనిని నిర్వహించింది. అయితే.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ అనుమతితో తాము సర్వే నిర్వహించినట్లు సదరు సంస్థ ప్రకటించుకుంది.  అయితే..

ఈ సర్వేతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి  ప్రిియాంక్ ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదని, నిర్వహించాలని ఆదేశించమూ లేదని పేర్కొన్నారు. పైగా సర్వేపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ‘‘మొదటగా చెప్పేది ఏంటంటే.. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాదు. రెండోది.. ఈ సర్వేను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఎన్జీవో సమన్వయంతో నిర్వహించింది. అయితే..

ఆ ఎన్జీవోను నడిపే వ్యక్తి.. ప్రధాని కార్యాలయానికి దగ్గరగా పనిచేసే వ్యక్తి. ప్రధాని కోసం అతగాడు ఓ పుస్తకం కూడా రాశాడు. వీటికి తోడు.. సుమారు 110కి పైగా నియోజకవర్గాల్లో కేవలం 5,000 మందిని మాత్రమే సర్వే చేసినట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ డేటాను ఎంత నమ్మొచ్చు?.. ఇంతకు మించి ఏం ఆశించొచ్చు’’ అని ప్రశ్నించారాయన. ఈ సర్వేను విశ్వసనీయంగా భావించడం లేదని.. దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని అన్నారాయన.

ఈ ఫలితం ఆధారంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేస్తున్న బీజేపీ.. కలబుర్గి, అలంద్ ప్రాంతాల్లో జరిగిన ఓటు చోరీపై మాత్రం ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదని ప్రియాంక్‌ ఖర్గే మండిపడ్డారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీ, బీజేపీలు కలిసి కలిసి పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులు చేశారని రాహుల్‌ గాంధీ ఆరోపిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  

ఓట్‌చోరీ రాజకీయం ప్రదానంగా కర్ణాటక నుంచే నడుస్తోంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసిపోయి ఎన్నికల్లో ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని విమర్శిస్తున్నాయి. అలాగే ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసీ పారదర్శకతను శంకించాల్సిన పని లేదని బీజేపీ.. కాంగ్రెస్‌ చేస్తున్నవి ఉత్త ఆరోపణలేనని ఈసీ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూ వస్తున్నాయి.

ఒక్క ఓటు తొలగిస్తే రూ.80!
కర్ణాటకలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై అక్కడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో.. ఓ డేటా ఎంట్రీ టీమ్‌కు లక్షల్లో రూపాయలు చెల్లించి ఓటర్లను తొలగించే పని అప్పగించారని అనుమానాలు నెలకొన్నాయి. ఆరుగురు వ్యక్తుల ముఠా ఈ స్కామ్‌ నడిపించిందని.. ఒక్క ఓటర్‌ను తొలగించడానికి రూ.80 ఛార్జ్‌ చేశారని.. అలా 2023 రాష్ట్ర ఎన్నికల ముందు సుమారు 7,000 ఓటర్లను తొలగించమని అభ్యర్థనలు వచ్చాయని అక్టోబర్‌ నాటి దర్యాప్తులోనే వెల్లడైంది.

తాజా ‘సర్వే లొల్లి’ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. మేము ఎప్పటినుంచో చెబుతున్నదే నిజమని తేలింది. 2023 ఎన్నికల ముందు అలంద్ నియోజకవర్గంలో 6,000కి పైగా నిజమైన ఓటర్లను డబ్బు చెల్లించి తొలగించారు అంటూ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)