Breaking News

కర్ణాటకంపై వీడని సస్పెన్స్‌

Published on Mon, 12/08/2025 - 03:47

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీలో అధికార మార్పిడిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో శనివారం రాత్రి  అధిష్టానం నేతలు సమావేశమయ్యారు.  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  సమావేశంలో కర్ణాటక అంశాన్ని ప్రత్యేకంగా చర్చించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

అయితే సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, రానున్న రోజుల్లో మరోసారి సమావేశమై చర్చిస్తామని తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగానే ఉన్నారని కూడా తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మధ్య రెండు బ్రేక్‌ఫాస్ట్‌  మీటింగ్‌ల అనంతరం రాష్ట్రంలో సీఎం మార్పు అంశం తాత్కాలికంగా బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.  

సంక్రాంతికి డీకేకు శుభవార్త! 
‘ఐదేళ్లు నేనే సీఎం’ అని చెప్పుకునే స్థాయి నుంచి ‘రా­జకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు’ అని చెప్పుకునే స్థా­యి వరకూ సిద్ధరామయ్య దిగిరావడాన్ని చూ­స్తే, డీకే సీఎం అవ్వడం దాదాపు ఖాయం అయిన­ట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సంక్రాంతికి డీకేకు హైకమాండ్‌ శుభవార్త అందించనున్నట్లు కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డీకేను ముఖ్యమంత్రిని చేస్తే వచ్చే సాధకబాధకాలపై హైకమాండ్‌ ప్రధానంగా శనివారం చర్చించినట్లు కూడా తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని వెల్లడించకముందు మరోసారి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని హైకమాండ్‌ భావిస్తోంది. ఇరువురి మధ్యా మరో బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం జరిగే అవకాశం ఉందని అంచనా. అనంతరం ఇద్దరిని ఢిల్లీకి పిలిపించి హైకమాండ్‌  చర్చించనున్నట్లు భావిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)