Breaking News

పోలీస్‌ అధికారితో అలా.. సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య

Published on Mon, 04/28/2025 - 20:59

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఓ పోలీస్‌ అధికారిపై చెయ్యేత్తి కొట్టబోయారు. అదీ పెద్ద పెద్ద నేతలు పాల్గొన్న ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుండగా.. ప్రతిపక్షాలే కాదు సామాన్యులు సైతం మండిపడుతున్నారు.

సోమవారం బెలగావిలో సంవిధాన్‌ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో బీజేపీకి చెందిన కొందరు అక్కడికి చేరుకుని నల్ల జెండాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఫ్లకార్డులతో నిరసన నినాదాలు చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ‘‘ఏయ్‌ ఎవరు మీరు? నోరు మూయండి’’ అంటూ గట్టిగా అరిచారాయన.

అయినా కూడా వాళ్లు శాంతించకపోవడంతో.. అక్కడే ఉన్న ఏఎస్పీ నారాయణ్‌ భరమణిని దగ్గరకు పిలిచారు. ‘‘ఏయ్‌.. ఎవరు ఇక్కడ ఎస్పీ? ఏం చేస్తున్నావ్‌? అంటూ చెయ్యేత్తి కొట్టబోయారు. అయితే ఆ అధికారి వెనక్కి వెళ్లగా.. సీఎం కూడా తేరుకుని చెయ్యిని వెనక్కి లాక్కున్నారు. ‘‘ఏం చేస్తున్నారయ్యా మీరంతా? వాళ్లంతా ఇక్కడి దాకా ఎలా రాగలిగారు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.

ఈ వీడియో కన్నడనాట దుమారం రేపింది. అధికారం శాశ్వతం కాదని.. తమరు ఐదేళ్లు అధికారంలో ఉంటారని.. కానీ  ఆ అధికారి 60 ఏళ్లు వచ్చే దాకా డ్యూటీలో ఉంటారంటూ జేడీఎస్‌ ట్వీట్‌ చేసింది. ఇక.. బీజేపీ ఆ అధికారికి సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేసింది. మరోవైపు.. కొందరు నెటిజన్లు సైతం సిద్ధరామయ్య తీరు తప్పుబడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)