Breaking News

‘నేనే సీఎం అవుతానని ఆశిస్తున్నా’

Published on Mon, 05/15/2023 - 16:09

సాక్షి, ఢిల్లీ/బెంగళూరు: కౌన్‌ బనేగా కర్ణాటక ముఖ్యమంత్రి?. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ.. సీఎం ఎంపికలో మాత్రం తర్జన భర్జనలు పడుతోంది. సీఎం రేసులో ప్రయారిటీ క్యాండిడేట్‌లుగా ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనేదానిపై చర్చలతో హస్తిన హీటెక్కిపోతోంది. రేపటి కల్లా పేరు ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో.. 

కొందరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తున్నా. నిన్న(ఆదివారం) జరిగిన సీఎల్పీ భేటీలో మెజార్టీ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయానికే కట్టుబడి ఉంటా. డీకే శివకుమార్‌తో నాకు మంచి స్నేహం ఉంది’’ అని 75 ఏళ్ల సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరో 24 గంటల్లో సీఎం ఎవరో తెలుస్తుందని వ్యాఖ్యానించారాయన. 

ఇక సిద్ధరామయ్య వెంట ఉన్న ఎమ్మెల్యేలలో దళిత, మైనార్టీ, ట్రైబల్‌, ఓబీసీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ వర్గాల ప్రజాప్రతినిధుల మద్దతు తనకు ఉందని అధిష్టానం  బలనిరూపణ కోసమే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. హైకమాండ్‌తో భేటీ అనంతరం ఆయన ఈ సాయంత్రం రాహుల్‌ గాంధీతో భేటీ కావొచ్చని తెలుస్తోంది. 

మరోవైపు కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌(62) కూడా నేడు ఢిల్లీకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన బెంగళూరులోనే ఉండడం, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని డీకే శివకుమార్‌ స్పష్టం చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.  ‘‘నేను ఢిల్లీ వెళ్లడం లేదు. నా పుట్టినరోజు వేడుకలు ఉన్నందున ఇంట్లోనే ఉంటున్నా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా’’ అని పేర్కొన్నారాయన. అధిష్టానం నుంచి పిలుపు రానందు వల్లే ఆయన ఢిల్లీ పర్యటనకు దూరం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం పిలిస్తే మాత్రం ఆయన ఢిల్లీకి వెళ్లొచ్చని సమాచారం. 

కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో డీకే శివకుమార్‌ ఓ మెట్టు కిందకు దిగొద్దని నిశ్చయించుకున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు ఏఐసీసీ పరిశీలకుడు, కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. మూడు గంటలపాటు వీళ్లు భేటీ జరిగింది. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ప్రతిపాదనను సైతం డీకే తిరస్కరించినట్లు సమాచారం. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేకుంటే కేబినెట్‌లో స్థానం కూడా వద్దంటూ డీకే, సూర్జేవాలాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జిగింపుల పర్వంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇద్దరిలో ఎవరిని సీఎం చేస్తుందో చూడాలి. 

ఇదీ చదవండి: డీకేకు సీఎం పదవి దూరం.. కారణం అదేనా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)