Breaking News

కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?

Published on Thu, 07/03/2025 - 11:29

మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్‌ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్‌ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని  బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది. 

మీరట్‌ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్‌ కోడ్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఆయన హెచ్చరించారు.  నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
 

కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు  నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.

ఇది కూడా చదవండి: అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్‌ హర్‌ మహదేవ్‌’ నినాదాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)