Breaking News

లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్‌ టైకూన్‌ కొడుకు అరెస్ట్‌, గంటల్లో బెయిల్‌

Published on Thu, 02/12/2026 - 18:11

లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్‌  కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే  కోర్టు బెయిల్‌ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం  జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని కాన్పూర్‌ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్‌ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే  కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు  కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఖరీదైన , హైస్పీడ్‌  కారు ఢీకొని  ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్‌ జరిగింది.

గత ఆదివారం  రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్‌ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్‌ కాదని, డ్రైవర్‌ మోహన్‌ యాదవ్‌ అని శివమ్‌ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్‌ మోహన్‌ యాదవ్‌ కూడా తానే డ్రైవ్‌ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసులు  ప్రకటించారు. శివమ్‌ మిశ్రా కాన్పూర్‌లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్‌ డీసీపీ తెలిపారు.

శివం మిశ్రా అరెస్ట్‌ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు.  రూ.20,000 అండర్‌ టేకింగ్‌ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌పై విడుదలైనట్టు తెలిపారు. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)