Breaking News

ముంబై ఫలితాలు.. శివసేనపై కత్తి దూసిన కంగనా

Published on Sat, 01/17/2026 - 11:24

ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలపై హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. 2020లో అవిభక్త శివసేన అధికారంలో ఉన్నప్పుడు బాంద్రా వెస్ట్‌లోని తన బంగ్లాను బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన ఘటనను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ‘మహిళా ద్వేషులు, రౌడీలు, నెపోటిజం మాఫియా’కు ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పారని కంగనా వ్యాఖ్యానించారు.

ముంబైలో శివసేన (ఠాక్రే వర్గం) ప్రాబల్యం తగ్గి, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంపై కంగనా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నన్ను దూషించి, నా ఇల్లు కూల్చివేసి, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని రాష్ట్ర ప్రజలే బహిష్కరించారు. అహంకారులు, మహిళా వ్యతిరేకులకు ‘జనతా జనార్దనులే’ వారి స్థానం ఏమిటో చూపించారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.

గతంలో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని కంగనా రనౌత్ కార్యాలయంలో కొంత భాగాన్ని నిబంధనల పేరుతో బీఎంసీ కూల్చివేసింది. దీనిపై కంగనా.. బాంబే హైకోర్టును ఆశ్రయించగా, నాడు న్యాయస్థానం బీఎంసీ చర్యను తప్పుబడుతూ, అది పూర్తిగా దురుద్దేశంతో కూడినదని స్పష్టం చేసింది. ముంబై పోలీసులపై, ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యల కారణంగానే నాడు బీఎంసీ కక్షపూరితంగా వ్యవహరించిందని కంగనా ఆరోపించారు. నాటి అవమానానికి ఈనాటి ఎన్నికల ఫలితాలే సరైన సమాధానమని ఆమె అన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఎన్నికల్లో బీజేపీ 11,79,273 ఓట్లతో (21.58 శాతం) ఏకంగా 89 స్థానాలను కైవసం చేసుకుని బీఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల విజయం సాధించింది. ముంబైతో పాటు పూణే, పింప్రి-చించ్వాడ్, థానే, నాసిక్, నవీ ముంబై వంటి కీలక నగరాల్లోనూ బీజేపీ విజయపతాకం ఎగురవేసింది.
 

ఇది కూడా చదవండి:అమెరికా ‘కస్టడీ’లో ఇ‍ద్దరు భారత విద్యార్థులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)